జీవిత భీమా పాలసీలు మీ కుటుంబానికి సామాజిక భద్రతను కల్పించడంతో పాటు
పొదుపు సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే
భారతదేశంలో ఇన్సూరెన్స్ పై ప్రజలలో అవగాహన లోపం ఎక్కువగా ఉంది. ఇన్సూరెన్స్
పై అవగాహన ఉన్న అభివృఉద్ధి చెందిన దేశాలలో ప్రజలు 80% నుండి 100% వరకు
ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకొనుచుండగా, ఇప్పుడిప్పుడే అభివృఉద్ధి చెందుచున్న
భారతదేశంలో 10% కంటే తక్కువ మంది ప్రజలు మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీలు
టీసుకొనుట, మనడేశ ప్రజలలో జీవిత భీమా పట్ల ఉన్న అవగాహనా రాహిత్యాన్ని
బహిర్గతం చేస్తుంది. ఆర్ధిక సంస్కరణల అమలు నేపధ్యంలో మన ప్రభుత్వం ఇన్సూరెన్స్ వ్యాపారాభివృద్ధిని కాంక్షిస్తూ 1999 సంవత్సరంలో అంతర్జాతీయ
భీమా కంపెనీలను మన దేశంలోనికి ఆహ్వానించడం జరిగింది.
1956 వ సంవత్సరమునకు ముందు భారతదేశంలో 250 కి పైగా ప్రైవేటు ఇన్సూరెన్స్ కార్యకలాపాలను నిర్వహిస్తూ
వుండేవి. కాని 1956 సంవత్సరములో ఇన్సూరెన్స్ ను నేషనలైజ్ చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LICI)
మరియు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (GIC) అనే ప్రభుట్వ సంస్థలు నెలకొని లైఫ్ ఇన్సూరెన్స్ మరియు జనరల్ ఇన్సూరెన్స్ ను
భారతదేశంలో ప్రారంభించారు. ఇవి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నడుపబడేవి. కాని 1999-2000
వ సంవత్సరములో పార్లమంట్ ఆమోద ముద్రతో భరతదేశంలో ఇన్సూరెన్స్ కార్యకలాపాలను పెద్ద ఎత్తున
చేయ తలపెట్టి ఇన్సూరెన్స్ రెగ్యులేటరి అండ్ డెవలప్మెంట్ అథారిటి (IRDA) అనే భారత ప్రభుత్వ రంగ సంస్థ
ఏర్పడింది.
IRDA భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగానికి ఒక క్రొత్త మలుపు అని చెప్పవచ్చు. భారత జనభాలో ఇన్సూరెన్స్ చేసినవారి సంఖ్య 3-4 శాతం కన్నా ఎక్కువ లేదు. ఎక్కువ శాతం ప్రజలకు ఇన్సూరెన్స్ పై సరైన అవగాహన
లేదని గ్రహించి భారతదేశంలో ఇన్సూరెన్స్ కంపెనీల ఆవశ్యకతను కనుగొని ప్రభుత్వ ఇన్సూరెన్స్
కంపెనీలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రజల డబ్బునకు పూర్తి భద్రత కల్పిస్తూ ప్రభుత్వ మరియు
ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపేనీల పై ఈ క్రిన్ది విదమైన షరతులను విధించరు. ప్రస్తుతం భారతదేశంలో 28
వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు వెలిశాయి.
1.
భారతదేశంలో ఇన్సూరెన్స్ కార్యకలాపాలు చేయతలచిన ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ తప్పనిసరిగా IRDA
అనుమతి పొందాలి.
2.
ఇన్సూరెన్స్ కంపెనీ కొరకు అనుమతి పొందువారు కనీస అర్హతగా 1000 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన కంపెనీ
అయి వుండాలి.
3.
సాల్వేషన్ మార్జిన్ రూపంలో IRDA వద్ద రూ.100 కోట్లు జమ చేయాలి.
4.
గిఫ్ట్ ఫండ్ రూపంలో RBI వద్ద రూ.100 కోట్లు జమ చేయాలి.
5.
కంపెనీ యాజమాన్యములోని ఏ ఒక్కరికి ఇన్సూరెన్స్ పాలసీల రూపంలో వచ్చిన ప్రజల డబ్బును అప్పుల రూపంలో
ఇచ్చే అనుమతి లేదు.
6.
IRDA రూల్సు పాటించనిచో కంపెనీలోని డైరెక్టర్స్ని కూడా తొలగించే హక్కు IRDA కు కలదు.
7.
ప్రజల నుండి వసూలు అయిన మొత్తమును
85 శాతం ---- పబ్లిక్ సెక్టార్ కంపెనీలకు (ప్రభుత్వ) ట్రెజరీ బిల్స్ రూపంలోను స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్
బాండుల రూపంలో ఉంచాలి.
15 శాతం ---- ఈక్విటీ ఫండ్స్ షేర్ మార్కెట్లో ఉంచవచ్చు కాని "ఎ" రేటెడ్ కంపెనీ అయి ఉండవలెను.
8.
ప్రతి మూడు మాసములకు కంపెనీకి సంబంధించిన లావదేవీలను తప్పనిసరిగా IRDA కు సమర్పించాలి.
9.
కంపెనీకి వచ్చిన లాభంలో తప్పనిసరిగా 95% ను బోనస్ రూపంలో పాలసీ హోల్డర్లకు అందచేయాలి.
10.
కలెక్షన్ టార్గెట్ లో కొంత శాతం రూరల్ మరియు సోషల్ అబ్లిగేషన్ తప్పనిసరిగా పాటించాలి.
11.
విదేశీ పెట్టుబడుల విషయంలో 73-27 నిష్పత్తిలో భారతదేశ కంపెనీలను అనుమతించారు.
12.
ఇన్సూరెన్స్ కంపెనీలు పైన పేర్కొన్న నిబందనలలో ఏది ఉల్లఘించినా నోటీసు లేకుండా లైసెన్సు రద్దు
చేసే అధికారము IRDA కు గలదు.
13.
ఇన్సూరెన్స్ కంపెనీ లావాదేవీల విషయంలో లేక కంపెనీ ప్రమాద పరిస్థితిలో ఉన్నట్లయితే పాలసీ
హోల్డర్ల భద్రత దృష్ట్యా సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీలను IRDA టేకోవర్ చేస్తుంది.
14.
ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీల విషయంలో తీసుకున్న నిర్ణయాలకు, క్రొత్త పథకాలకు ఎప్పటికప్పుడు
తప్పనిసరిగా IRDA అనుమతిని పొందుతూ ఉండాలి.
పైన పేర్కొన్న నిబంధనలు ప్రైవేటు సంస్థలకే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలయిన LIC మరియు GIC లకు
కూడా వర్తిస్తాయి.
భారతదేశంలో ప్రైవేటు లేదా ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికి భద్రత విషయంలో
ఎలాంటి భయం అవసరం లేదు. పైగా ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య పోటీ వలన ప్రజలకు మంచి రిటర్న్స్ తో పాటు
రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఇన్సూరెన్స్ కంపెనీలలో డబ్బు పొదుపు చేయడం తెలివైన పని.
1.
బజాజ్-అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
2.
మ్యాక్స్-నూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
3.
కోటక్ మహింద్రా ఓల్డ్ మూచ్యువల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
4.
టాటా - ఎఐజి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
5.
ఐ.సి.ఐ.సి.ఐ. ఫ్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
6.
హెచ్.డి.ఎఫ్.సి. స్టాండర్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
7.
అవీవా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండియా (ప్రై) లిమిటెడ్
8.
బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
9.
ఐ.ఎన్.జి.వైశ్యా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రై లిమిటెడ్
10.
ఐ.ఎన్.జి.వైశ్యా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రై లిమిటెడ్
11.
ఎస్.బి.ఐ. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
12.
రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
13.
సహారా ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
14.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
15.
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
16.
భారతి ఎక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
1.
రాయల్ సుందరం అలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
2.
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
3.
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
a.
ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
b.
ది న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
c.
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
4.
ఇఫ్కో - టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
5.
టాటా - ఎఐజి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
6.
బజాజ్-అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
7.
ఐ.సి.ఐ.సి.ఐ. లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
8.
ఛోలమండలం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
9.
హెచ్.డి.ఎఫ్.సి. ఛబ్ జనరల్ కంపెనీ ఇండియా లిమిటెడ్
10.
అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండియా లిమిటెడ్
11.
స్టార్ హెల్త్ అండ్ ఎలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
కస్టమర్ ప్రొటెక్షన్ (అంబుడ్స్ మెన్ స్కీమ్)
భారత ప్రభుత్వము నోటిఫికేషన్ 11-11-1998 డ్వారా అంబుడ్స్ మెన్ అనే సంస్థను నెలకొల్పారు. దీని
ప్రధాన ఉద్దేశ్యము పాలసీహోల్డర్ కు సంబంధించిన క్లెయిమ్స్ విషయాలలో ఇబ్బందులు, ఇన్సూరెన్స్
కంపెనీలకు, పాలసీ హోల్డర్ల మధ్య వివాదాలు త్వరితగతిన పరిష్కరించడంలో
ఉపయోగపడుతుంది. తద్వార పాలసీ హోల్డర్లలోను మరియు ఇన్సూరెన్స్ కంపెనీలలోను విశ్వాసాన్ని
నమ్మకాన్ని కలుగజేయడం అంబుడ్స్ మెన్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
భారతదేశంలోని ముఖ్యమైన 12 పట్టణ ప్రాంతాలలో అంబుడ్స్ మెన్ కార్యాలయాలు ఉన్నాయి అవి:
1. భోపాల్
2. భువనేశ్వర్
3. కొచ్చిన్
4. గౌహతి
5. చంఢీఘడ్
6. న్యూఢిల్లీ
7. చెన్నై
8. కలకత్తా
9. అహ్మదాబాద్
10. లక్నో
11. ముంబాయి
12. హైదరాబాద్
బజాజ్ అలియాన్జ్
బజాజ్ అలియాన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ
బజాజ్ అలియాన్జ్ ఇన్సూరెన్స్ ఎందుకు?
బజాజ్ అలియాన్జ్ లాఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అన్నది ప్రపంచంలో ప్రముఖ భీమా కంపెనీ
(ఇన్స్యూరర్) అయిన అలియాన్జ్ ఏ.జి. మరియు భారతదేశంలో అత్యధికంగా గౌరవించబడే కంపెనీ
అయిన బజాజ్ ఆటోల సంగమం అలియాన్జ్ ఏ.జి. వారు విశ్వమంతటా సంఘటితమైన భీమా కంపెనీ
ప్రపంచంలో అతి పెద్ద అసెట్ మేనేజర్ గా, 980 బిలియన్లు యూరోల (రూ. 49,84,500 కోట్లు)
ఆస్తులను (అసెట్స్) ను నిర్వహిస్తున్నరు. మీరు కష్టించి సంపాదించిన మీ డబ్బుని నమ్మకంతో
వెచ్చించేందుకు కావలసిన ఒక భీమ కంపెనీకోసం ఎదురు చూస్తున్నరని మేము అవగాహన
చేసుకున్నము. అలియాన్జ్ ఏ.జి. వారికి 70కిపైగా గల దేశాల్లో, 110 ఏళ్ళకు పైగా ఆర్ధిక
అనుభవం ఉంది. బజాజ్ ఆటో వారికి భారతదేశపు మార్కెట్లో 55 ఏళ్ళకు పైగా
విశ్వసనీయమైన పేరుంది. వీరిద్దరూ, మీకూ, మీ కుటుంబానికి కావలసిన భద్రతను
కలుగజేసి ఆర్ధిక పరిష్కారలను అందించేందుకై కంకణం కట్టుకున్నారు.
బజాజ్ అలియాన్జ్లో కస్టమర్ల సంతోషమే మాకు మార్గదర్శక సూత్రం. మా వ్యాపార
సిద్ధాంతమేమంటే, ఉన్నతమైన సాంకేతిక పరిజ్నానపు మద్ధతు గల పారదర్శకమైన
ప్రయోజనాలతో, మీకు తగ్గట్టున్న ప్రాస్జెక్టులను సమర్పికంచడం ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి
చెందిన పరిష్కారాలను మీకందించడానికి హామీ ఇవ్వబడటం.
పాలసీ వివరములు:
1. సహజ భీమా రక్షణ 70 సంవట్సరముల వరకు.
2. పరిమిత కాలం చెల్లింపు, 60 సంవట్సరములలోపు అందరూ అర్హులేల్.
3. 65 సంవట్సరముల వరకు / యాక్సిడెంటల్ బెనిఫిట్.
4. హాస్పిటల్ రూమ్ రెంట్ ఒక సంవట్సరమునకు రూ. 12,000 దగ్గర నుండి రూ. 60,000/- వరకు.
5. క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్, హర్ట్ ఎటాక్, బైపాస్ సర్జరీ, స్ట్రోక్, క్యాన్సర్, మూత్రపిండముల సమస్యలు,
ప్రధాన అవయముల మార్పిడి మెదడుకు సంబంధించిన వ్యాధులు, పెరాలసిస్, హై.బి.పి. వల్ల
ఏదైనా భాగం చచ్చుబడిపోవటం, మతిమరుపు వ్యాధి మొదలగు వ్యాధులకు చికిట్స నిమిత్తం
భీమా రక్షణ.